ఇంటికో యువకుడు..ఊరికో బస్సుతో దండుగా కదిలి..కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
-బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు నేర్పటి శ్రీనివాస్
ఈనెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇంటికో యువకుడు..ఊరుకో బస్సుతో దండుగా కదిలి..కేసిఆర్ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి..అవినీతి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల నాయకుడు నేర్పటి శ్రీనివాస్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ళ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2021 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ తో తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి..తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి..ఎన్నో కష్టనష్టాలకు, అవమానాలకు, అణచివేతకు వెనుకడుగు వేయకుండా..ప్రజలను అంటిపెట్టుకొని..రాష్ట్ర సాధనకై అలుపెరుగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో..ఆ తర్వాత 10 ఏండ్లు అధికారంలో..నేడు ప్రతిపక్షంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలకు అండగా నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా మాత్రమేనన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం..పదేళ్ల పాలన..మేలవింపు తెలంగాణ గుండె చప్పుడుగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ..ఉద్యమం పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. టిఆర్ఎస్ 25 ఏళ్ల మహా ప్రస్థానం సందర్భంగా ఈనెల 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందన్నారు.