జైపూర్, నేటి ధాత్రి’
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రానికి సమీప అడవి ప్రాంతంలో గల స్థానిక మల్లన్న స్వామి దేవాలయం చుట్టుపక్కల రిజర్వు ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించడం జరిగింది. “ప్రకృతిని ప్రేమిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం” అనే నినాదాన్నీ స్ఫూర్తిగా తీసుకొని చెట్ల పెంపకాన్ని, సంరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించాలని,అడవులను, వన్యప్రాణులను, అరుదైన పక్షి జాతులను కాపాడాలని ప్రజలను పర్యావరణ దినోత్సవ సందర్భంగా కోరడం జరుగుతుందని అటవీ శాఖ సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్ అటవీ శాఖ సిబ్బంది మరియు జైపూర్ ఎంపీ ఓ అనిల్ కుమార్, జైపూర్ పంచాయతీ సెక్రెటరీ ఉదయ్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.