గ్రూపు రాజకీయాలు పక్కన పెడదాం

వర్గ భేదాలు లేకుండారెడ్యానాయక్ ను భారీ మెజార్టీ తో గెలిపిద్దాం

అధినేత చెప్పినట్టు కలసికట్టుగా పార్టీ కోసం పని చేద్దాం

-మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత

మరిపెడ నేటి ధాత్రి

మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామంలో మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గం స్థాయి శ్రీరంగారెడ్డి ఇంట్లో తన అనుచరుల తో సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మీకు కొంత నష్టం కలిగించినాను అంటూ తన అనుచరులను బొజ్జగించారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే. పక్కన పెట్టి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని డోర్నకల్ నియోజకవర్గంలో బారాస అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలని స్పష్టంగా తన అభిప్రాయాన్ని ఆదేశాలను అనుచరులకు గట్టిగా సమాచారం ఇచ్చారు కెసిఆర్ నాయకత్వంలో మన డోర్నకల్ అభ్యర్థి డి ఎస్ రెడ్యానాయక్ నీ మెజార్టీతో గెలిపించుకోవాలని బేధాభిప్రాయాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ఎంపీ కవిత మాట్లాడుతూ డోర్నకల్ ఎన్నికల్లో ఇన్చార్జిగా నేనే ఉంటున్న కావున ఎటువంటి వర్గ భేదాలు లేకుండా కలిసికట్టుగా పని చేసుకుందామని మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రెడ్యానాయక్ భావోద్వేగ ప్రసంగం ఇస్తూ ఇవే నాకు చివరి ఎన్నికలు నాకు ఓటు వేసిన వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను నియోజకవర్గంలో నేనెవరికీ అన్యాయం చేయలేదు ఈ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా నా గెలుపుకు సహకరించాలి మాట అంటే నేను మాట తప్పే మనిషిని కాదు నియోజకవర్గంలో గ్రామాల నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో
మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,బండి వెంకటరెడ్డి శ్రీ రంగారెడ్డి , కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , పర్కాల శ్రీనివాస్ రెడ్డి , కెఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, కుడితి మహేందర్ రెడ్డి , అచ్యుత రావు , రాంపల్లి అబ్బాయి గౌడ్,గుగులోతు వెంకన్న ,రాంబాబు,రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *