చేర్యాల నేటిధాత్రి…
గత ఎనిమిది ఏళ్లు గా ప్రజాసంఘాల మద్దతు,రాజకీయ పార్టీల నాయకుల సంపూర్ణ సహకారంతో జరిగి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం తిరిగి ఉవ్వెత్తున జనాల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు మనం అందర0 ముందుకు సాగాలని దానికి అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ,అభిప్రాయ బేదాలు ప్రక్కన పెట్టి చేర్యాల ప్రాంత ప్రజల పక్షం ,ప్రజలకోసం పోరాటాలు చేయడానికి మీరందరూ ముందుకు రావాలని చక్రదారి కోరుచున్నారు. చేర్యాల పేద ప్రజల పక్షాన వుంటూ పోరాటాలు చేస్తున్న ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ, ప్రజల సమస్యలే మా ఎజెండా అంటున్న సీపీఎం పార్టీ, ఇప్పుడిప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషించిన టి ఆర్ ఎస్ పార్టీ,,దేశం కోసం అంటున్న బీజేపీ పార్టీ,విద్యార్థి సంఘాలు,ప్రజాసంఘాలు,మేము సైతం అంటున్న వర్తక వాణిజ్య సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు ,ఎమ్మార్పీఎస్, మాల మహానాడు,మిగతా అన్ని సంఘాలు ,చేర్యాల ప్రాంత ప్రజల అస్తిత్వ0 కోసం జరిగే ఉద్యమాన్ని ఉదృతం చేయాలని చక్రదారి వకీలసాబ్ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. కొద్దీ రోజుల్లో చేర్యాల లో జరిగే మన జాక్ సమావేశo లో అందరూ ఆహ్వానితులే నని, తమ అభిప్రాయాలను తెలియజేయాలని,ఉద్యమం లో మనము అందరం భాగస్వామ్యం ఉండాలని చక్రదారి కోరారు.. అన్నిపార్టీలకను కలుపుకొని సమన్వాయంతో నేను ముందుకు వెళుతానని ,ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ప్రజాలపక్షం చక్రదారి గొంతు పనిచేస్తుందని ఆయన చెప్పారు,,అందరూ ఆహ్వానితులే నని కలిసి పోరాడి డివిజన్ సాదిద్దామని,చక్రదారి చెప్పారు.