
కారు గుర్తుకు ఓటు వేద్దాం. రమణన్న గెలిపిద్దాం. *మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి.
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కొత్తగట్టు సింగారంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను ఓటు అభ్యర్థించారు.మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం నిరంతరం కొనసాగించాలంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని శాయంపేట మండలంలో కొత్తగట్టు సింగారం గ్రామంలో ఎన్నో నిధులను వెచ్చించి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు కార్యకర్తలు మరియు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.