
Educate Girls, Empower Society – Principal Priscilla
నిబంధనలు పాటిద్దాం.. సురక్షితంగా ప్రయాణిద్దాం
◆:-ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు తోలిపే సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకోవచ్చని ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ అన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని జాతీయ రహదారిపై వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించి తమ వాహనాన్ని రోడ్డుపై తేవాలని, కారు చోదకులు సీటు బెల్టును ధరించా లన్నారు. లైసెన్సులు ఉన్న వారే వాహనాలను తోలాలన్నారు. వాహనాలకు సంబంధించి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రాంగ్ రూట్లో, మధ్యం తాగి వాహనాలను నడపరాదన్నారు. సామర్యాధినిక మించి వాహనా లపై ప్రయాణించవద్దన్నారు. మైనర్లకు వాహనలు ఇవ్వవద్దని, మైనర్లు వాహనాలతో రోడ్డెక్కితే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.