కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాడుదాం

ఏనుమాముల మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 9 10 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు మహాధర్నా వాల్ పోస్టర్ విడుదల

వరంగల్, నేటిధాత్రి

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు ఐక్యం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపు. ఈ సందర్భంగా జరిగిన మహా పడావ్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి కార్మిక వర్గాన్ని విచ్చిన్నం చేసిందని ఆయన అన్నారు. మరొకవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటు పరం చేస్తూ బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. దేశానికి సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలని మోడీ చెప్పడం కార్మిక వర్గాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు. ఈ దేశానికి సంపద సృష్టికర్తలు కార్మిక వర్గమని మోడీ గమనించాలని ఆయన కోరారు. మరొకవైపు దేశంలో కనీస వేతన చట్టాలు జీవోలు ఇవన్నీ ఉన్నా ఇవన్నీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కార్మికుల యొక్క రోజు వారి కనీస వేతనాన్ని 175 రూపాయలుగా నిర్ణయించడం మోడీ యొక్క పనితీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. 175 రూపాయల కనీస వేతనంతో కార్మికులు ఏ విధంగా జీవిస్తారని ఆయన ప్రశ్నించారు. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని మాట ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి 8 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్మిక సంఘాన్ని చర్చలకు పిలువ లేదని కెసిఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆయన అన్నారు. సామిల్ మిల్లులో పని చేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెబుతూ కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి సగటున్న ఒక కుటుంబం బ్రతకాలంటే లెక్కల్లో నెలకు కుటుంబానికి సరిపడే సరుకులు తీసుకోవాలన్న కుటుంబాన్ని పోషించుకోవాలన్నా నెలకు 25 నుండి 28 000 ఉంటేనే కుటుంబం గడుస్తుందని చెప్పినటువంటి లెక్కలలో ఏ ఒక్కటి అమలుకాకుండా పోయిందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కార్మికులను ఆదుకోవాలని నెలకు 31 వేల రూపాయల వేతన ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల కార్మికులందరినీ ఐక్యం చేసి కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తామని అందులో భాగంగానే ఈనెల 10వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాలో కార్మికులందరూ పాల్గొనాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి దామెర కృష్ణ, గుమస్తల సంఘం అధ్యక్షులు ఇనుముల మల్లేశం,
ఏఐసిటియు జిల్లా కార్యదర్శి చుచ్చు జగదీశ్వర్‌, సిఐటియు జిల్లా నాయకులు గోర్రె శేఖర్, కుమార్, ఎస్కే హఫీజ్, మాలకుమ్మరి రమేష్, వేణు గోపాల్, కుమార స్వామి, మంద దేవెందర్, వైకుంటం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!