దుమ్మగూడెం మండలం మహాజన సమితి. మహిళా అధ్యక్ష కార్యదర్శులుగా –కుంజ దేవిశ్రీ –ఇసంపల్లి శృతిలయ నియామకం.
భద్రాచలం నేటి దాత్రి
భద్రాచలం. ది. 28-02-24 (బుధవారం ) మహాజన సమితి మహిళా ఆదివాసిరాష్ట్ర ఉపాధ్యక్షులు కంగాల రమణకుమారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాటిబోయిన కనక పెదపాటి కామాక్షి దుమ్ముగూడెం మండలం మహాజన సమితి మహిళా అధ్యక్షులు కుంజా దేవిశ్రీ కార్యదర్శిగా ఇసంపల్లి శృతిలయ ను నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన దుమ్ముగూడెం మండలం అధ్యక్ష కార్యదర్శులు కుంజా దేవిశ్రీ , ఇసంపల్లి శృతిలయ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళ పైన జరుగుతున్న సంఘటనలను ప్రభుత్వం అలసత్వం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు మహిళలపై అనేక రకాల దాడులు జరగటానికి మద్యం విచ్చలవిడి అమ్మకాలు వలన యువకులు చెడిపోతున్నారని అంతేకాకుండా డ్రగ్స్ మాఫియా గంజాయి సిగరెట్ వంటి మారకద్రవ్యాలు వలన విద్యార్థులు యువకులు వాటికి బానిసలై అనేక నేరాలకు అత్యాచారాలకు కారణమవుతున్నాయని ప్రభుత్వం తక్షణమే వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు ప్రైవేట్ సెక్టార్లో మహిళలు జీవనోపాధి కోసం పనిచేస్తున్నారని వారికి భద్రత లేకపోవడం వలన అనేక చోట్ల ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణ కల్పించాలని నిరుద్యోగ మహిళలకు గౌరవ వేతనంగా నెలకు 3000 అందించాలని ఉద్యోగ భద్రత నిరుద్యోగ భృతి తక్షణమే కల్పించాలని వారు అన్నారు దుమ్ముగూడెం మండలం మహాజన సమితి మండల మహిళా అధ్యక్ష కార్యదర్శులుగా నియమించినందుకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంగాల రమణకుమారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు