మహిళ సమానత్వ సాధనకై పోరాడుదాం

# సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాదవి.

నర్సంపేట,నేటిధాత్రి :

మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళ సమానత్వ సాధనకై పోరాడుదాం అని సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాదవి అన్నారు.నర్సంపేట పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకురాలు కాసు మాదవి మాట్లాడుతూ ఆనాడు సమానత్వం కోసం పోరాడి అమరులైన వీరవనితల బలిదానం రోజునే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని ఇప్పుడు అంతర్జాతీయంగా మహిళా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైన రోజుగా నిలిచిందని అన్నారు.పని గంటల తగ్గింపుకోసం, సమానత్వం కోసం, పని ప్రదేశంలో సౌకర్యాల కల్పన కోసం, పురుషులతో సమానంగా వేతనం కోసం 1857 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వేలాదిమంది యువతులు, మహిళలు విరోచితంగా పోరాడి కాల్చివేతకు గురై వీరనారీమణుల బలిదానంతో ప్రపంచవ్యాప్తంగా అనేక హక్కులు సాధించుకున్న మహిళలు ఆ స్ఫూర్తితోనే నేటికీ తమపై జరుగుతున్న దాడులు ,హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఐక్యంగా సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు వజ్జంతి విజయ,బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి,బి లక్ష్మి, యాక లక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు, హన్మకొండ శ్రీధర్, కందికొండ రాజు, డివైఎఫ్ఐ నాయకులు కలకోట అనిల్, విలియంకేరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!