పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగక్క
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గుండాల మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం(పిఓడబ్ల్యు) గుండాల మండలం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగక్క, రాష్ట్ర నాయకురాలు వై జానకి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషిస్తుందని మహిళలు తమ జీవితాన్ని ఎంపిక చేసుకునే హక్కు పై పితృస్వామ్య సంకెళ్లు బలోపేతం చేసే మనువాద భావజాలాన్ని అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగాపోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రాంతంలో మహిళలను చైతన్యవంతులు చేసేటందుకు సాగిన ప్రతిఘటన పోరాటంలోరంగవల్లి, స్నేహలత,నిర్మల, అంకమ్మ, సుసేనా, చింతా లక్ష్మి ఎందరో పోలీస్ కాల్పుల్లో అమరులయ్యారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క మహిళ పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు నాయకురాలు రోల్లగడ్డ ఎంపీటీసీ కల్తి రాజేశ్వరి, యాసారపు వెంకటలక్ష్మి, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు, మాజీ ఉప సర్పంచ్ మానాల ఉపేందర్,అరేం నరేష్,గడ్డం లాలయ్య,ఇసం కృష్ణన్న, మల్యాల మల్లేష్,పాయం ఎల్లన్న, బానోతు లాలు,బానోత్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.a