విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU
పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
చెన్నూర్:: నేటి ధాత్రి
చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను లంపెన్ గుండాల దాడులను ఎదిరించాడు అన్నారు.
సమసమాజ స్థాపనకు ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు హత్య చేశారన్నారు.ఆయన ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాహుల్, రవికిరణ్, స్నేహ, రవళి, లక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు