సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీనేత ఆవునూరి మధు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఈనెల 16వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచుదామని సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవు నూరి మధు పిలుపునిచ్చారు.
గురువారం గుండాల మండలంలోని కొడవటంచ గ్రామంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశంలో తను మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువస్తే సంవత్సర కాలం పోరాడి ఈ చట్టాలను రద్దు చేయించుకోగలిగారని, ఈ నల్ల చట్టాల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అందులో భాగంగానే సంయుక్త కిషన్ మూర్చ (ఎస్ కేయం) పిలుపు మేరకు ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత (ఏఐ కేఎంఎస్)రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, ఆరేం నరేష్,వై వెంకన్న, పర్శక రవి, గడ్డం లాలయ్య, ఎస్కే ఆజ్గర్, ఇసం కృష్ణన్న, ఈసం మంగన్న,బచ్చల సారన్న, పూనెం నరసన్న, పాయం ఎల్లన్న మోకాళ్ళ సూర్యనారాయణ, పటేల్ యానయ్య, ఈసం మల్లన్న, ఈసం రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.