కులాంతర వివాహాలను ప్రోత్సహిద్దాం

కుల నిర్మూలనకు బాటలు వేద్దాం

కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రేమికుల రోజును పురస్కరించుకొని కులాంతర, వివాహాలు చేసుకున్న జంటలను సన్మానించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు ఇసునం. మహేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల రహిత సమాజం ఏర్పడాలంటే సమాజంలో అసమానత లు తొలగి పోవాలంటే కుల వివక్ష, అంటరానితనం ఉండకూడదు అంటే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని అలుపెరగని పోరాటం చేసి కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహం అందించే జీవో నెంబర్ 12 ను సాధించిన ఘనత కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘానిదని అన్నారు. అదేవిధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు కెవిపిఎస్ అండగా ఉంటుందని పెళ్లి తో పాటు ప్రోత్సాహం కూడా అందే వరకు మీకు అండగా నిలబడతామని ఆయన అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!