వాస్తవ విషయాలపై చర్చించాలే

 

మహనీయుల స్పూర్తిని చాటి చెప్పాలే

బావితరాల కోసం యువత ఆలోచన చేయాలే

మంథని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

ముత్తారం :- నేటి ధాత్రి

మంథని నియోజకవర్గంలో వాస్తవ విషయాలపై యువత చర్చించాల్సిన అవసరం ఉందని మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు.
మంథని పట్టణంలోని రాజగృహాలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సందరేల్లి గ్రామానికి చెందిన సుమారు 80మంది యువకులు స్త్రీలు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతానికి ప్రస్తుతానికి బేరీజు వేసుకుని వాస్తవాలను గ్రహించాలన్నారు. మభ్యపెట్టేవాళ్లు ఎవరో మంచి చేసే వాళ్లు ఎవరో ఆలోచన చేసి ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి అభివృధ్దిబాటలు పడాలంటే స్థానిక యువకులు మంచి నాయకత్వానికి మద్దతు తెలుపాలన్నారు. అనేక ఏండ్ల క్రితం మహనీయులు మన గురించి మన బావితరాల గురించి ఆలోచన చేసి జీవితాలు త్యాగం చేసిన విషయాలను, మహనీయుల చరిత్రను తెలుసుకుని వారిస్పూర్తిని చాటి చెప్పాలన్నారు. బావితరాల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత యువతరం ఉందని, ఆ దిశగా ఆలోచన చేస్తూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఎంపీపీ జక్కుల ముత్తయ్య జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్ వైస్ ఎంపీపీ సుధాడి రవీందర్ రావు పి ఏ సి ఎస్ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షుడు అల్లం తిరుపతి సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు నూనే కుమార్ మాజీ ఎంపీటీసీ బండారి సుధాకర్ మాజీ సర్పంచ్ లు తీర్తాల లక్ష్మయ్య జక్కుల సదయ్య మండల ఉపాధ్యక్షుడు వేల్పుల శ్రీశైలం వార్డ్ మెంబెర్ బూడిద రమేష్ సీనియర్ నాయకులు నక్క రాజయ్య, మంథని సమ్మయ్య, సమ్మయ్య, బూడిద రవి, సుందిళ్ల శంకర్, ఉగ్గే మొగిలి, మంథని కొమురయ్య, బూడిద చంద్రయ్య, మంథని, రాజయ్య,తాండ్ర మధుకర్, మంథని సంతోష్, శంకర్, కుమార్, కుమార్, బంగార్రాజు,దిలీప్,వంశీ, బూడిద అజయ్, కొండ శివ, సాయికృష్ణ, గణేష్,యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *