ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి నేటిధాత్రి
పార్టీలకతీతంగా టేకుమట్ల మండలాన్ని అన్ని విధాలా, సమిష్టి కృషితో పనిచేసి అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (మంగళవారం) టేకుమట్ల మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం(యం.ఆర్.సి)లో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.
అధికారులు మండల సర్వసభ్య సమావేశాలకు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత ఐదు నెలల కిందట కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. మండలంలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని గ్రామాలల్లో కొత్త పెన్షన్లు ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులను అందిస్తామని అన్నారు. పలు శాఖల అధికారులు విధిగా జరిగే గ్రామ సభలకు హాజరు కావడంలేదని పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొనగా, దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.., ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం అర్హులైన నిరుపేదలకు తప్పనిసరిగా అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉంటూ, కృషి చేయాలని కోరారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిలో సిటీ స్కానింగ్, MRI స్కానింగ్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతూ, ప్రైవేట్ ఆస్పత్రిలో వేలాది రూపాయలు చెల్లించడం జరుగుతుందనిదీంతో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ సమావేశంలో టేకుమట్ల మండల జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి, యంపిడీవో అనిత, తహసీల్దార్ మంజూల, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, పలు గ్రామాల సర్పంచ్ లు , ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.