డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
నిజాంపేట్, నేటి ధాత్రి, ఏప్రిల్ 25
మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన మనువాదాన్ని ఒడించి ప్రజలందరికి స్వేచ్చ,
సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకొవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు.
డిబిఎఫ్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ సదస్సు గురువారం నాడు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో లో రాజ్యాం పరిరక్షణ ప్రచారోద్యమం చెపట్టారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మహనీయులైన పూలే,అంబేద్కర్, జగ్ జీవన్ రామ్ ల జయంతుల మహత్సోవం సందర్భంగా రాజ్యాంగ రక్షణ ప్రచారోద్యమాన్ని చెపట్టమని శంకర్ తెలిపారు. విద్య,ఉద్యోగం, ఆస్తులు,
సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరంచేసిందన్నారు.
ఈ సమావేశంలో డిబిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,డిబిఎఫ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్,ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు సామాజిక కార్యకర్తలు మహ్మద్ సుల్తానా,
మహ్మద్ ఉమర్,పుట్ట రాజు,
డిబిఎఫ్ కామరెడ్డి జిల్లా కన్వీనర్ మేకల లావణ్య, వాణి , శోభ రామవ్వ కాంభోజ శ్రీనివాస్ జిడిపల్లి లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.