
BRS in-charge Dr. Raja Ramesh Bab
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం..
బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ బాబు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దామని చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడారు. మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో నేడు ప్రొఫెసర్ జయశంకర్ ఏడు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలంతా అధిక సంఖ్యలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాంతం పాటు పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటె ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కెసిఆర్ తో కలిసి ఆయన చేసిన సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలని, యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారని అన్నారు. జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, పోగుల మల్లయ్య,మహేష్, నాయకులు గడ్డం రాజు, కుమార్, ఆర్నె సతీష్, ఎల్లబెల్లి మూర్తి, పిల్లి సతీష్,నందిపేట సదానందం, రామిడి లక్ష్మి కాంత్,చంద్ర కిరణ్, దబ్బేటి సంతోష్ ,మని, గోనె రాజేందర్, ఓదెలు, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.