రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగించుకుందామని. అందుకు అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించి. అందరం ఐక్యంగా పనిచేసే సీఎం కేసీఆర్ కి కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణరావు, సర్పంచ్లు బోయిని రాజ్ కుమార్, సదయ్య, రమరాజయ్య, ఎంపీటీసీ కడవెరుగు మమత, రాజయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రావు, ఓదలు, వార్డు సభ్యులు లక్ష్మి, మల్లేష్, రాజ్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు సమ్మారావు, వేణు, మనోహర్ రావు, శ్రీధర్, ప్రశాంత్, కిషన్ రావు, వెంకటేష్, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.