
World Indigenous Peoples Day.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాని ఘనంగా జరుపుదాం
గుండాల(భద్రాద్రికొత్తగూ డెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల మండలకేంద్రంలో ఆగస్టు 9న జరగబోయే ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు తీర్మానించారు. పార్టీలకు అతీతంగా ఆదివాసీ వివిధ పార్టీ నాయకులు, మేధావులు వివిధ సంఘాలు, నాయకులు ఉద్యోగులు, విద్యార్థులు, ఆశ వర్కర్స్ అంగనివాడి టీచర్స్ వివిధ గ్రామాలనుండి రైతులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని తుడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి కోరారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు పూనెం శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ యర్రయ్య, గుండాల మండల అధ్యక్షులు గోవిందా నర్సింహారావు, మండల కార్యదర్శి మోకాళ్ళ మహేందర్, మండల కోశాధికారి జవ్వాజి జోషి పాల్గొన్నారు.