Tributes Paid to Babu Jagjivan Ram
బాబు జగ్జీవన్ రామ్ ఆశిం చిన సమాజాన్ని నిర్మిద్దాం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
బాబు జగ్జీవన్ రామ్ సమ సమాజ స్థాపన కోసం ఎంతో కృషి చేశారని, ఆయన ఆశిం చిన సమాజాన్ని అందరూ కలిసి నిర్మిద్దామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సంద ర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి మాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్య మంలోనూ. స్వరాజ్యం వచ్చా క ఆధునిక భారతదేశ నిర్మా ణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొని యాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయ న చేసిన పోరాటం ఇప్పటికీ స్పూర్తిదాయకంగా నిలుస్తుం దన్నారు. స్వాతంత్రం అనం తరం అతి చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసు కొని ముందుకెళ్లాలని ఆకాం క్షించారు. ఓ సంఘసంస్కర్త, కేంద్రమంత్రి గా ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాసని రవి, నూర్జగాన్పల్లి సర్పంచ్ రాజీరు మైలారం ఉపసర్పంచ్ మసికే కుమా రస్వామి, మారపల్లి కట్టయ్య, మామిడి సుదర్శన్, కోల శ్రీను, యువజన నాయకుడు కొ మ్ములవిష్ణు పాల్గొన్నారు.
