బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ జిల్లా, వరంగల్ తూర్పు నగరంలోని మహేశ్వరి గార్డెన్స్ లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం-2024 ప్రారంభోత్సవం సందర్బంగా ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ 2047 లోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం శక్తివంతమైన బీజేపీ తోనే సాధ్యమని, ఆ సంకల్పాన్ని సాధించే దిశగా విశ్వగురువు భారత ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మార్గదర్శనంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి నాయకత్వంలో జాతీయస్థాయి నుంచి ప్రతి రాష్టం, నగరం, గ్రామం, బూత్ స్థాయి వరకు పార్టీని మరింత విస్తరించేలా, వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చెప్పట్టడం జరిగిందని, 18కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ఈదేశాన్ని అభివృద్ధిలో, ప్రజల సంక్షేమంలో వికసింప చేస్తున్న నరేంద్ర మోడి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో సభ్యులమవుదాం. వికసిత భారతన్ని నిర్మిద్దాం అని అన్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరితో సభ్యత్వం చేయించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని దిశా నిర్దేశం చేశారు జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభ్యత్వ సహా ప్రముఖ్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు, సభ్యత్వ జిల్లా ఇన్చార్జి పాపారావు, సభ్యత్వ సహా ఇన్చార్జి పాపన్న, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ మొర్చ అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్, మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ కుసుమ సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా పదాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్ఛ నాయకులు, మండల డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.