
కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి
కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి మున్సిపల్ సిబ్బందితో స్వాగతం తెలియజేస్తూ అవిశ్వాసంలో నెగ్గి మొదటిసారి కార్యాలయానికి వచ్చిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మిని ఘనంగా సన్మానించిన మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి సిబ్బంది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అందరం కలిసి కొత్తగూడెం పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రగతిని సాధిద్దామని అవిశ్వాసంలో నెగ్గి చైర్ పర్సన్ గా కాపు సీతాలక్ష్మి రావడంతో సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేశారని వారి మంచితనం వారు చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుందని ఇంకా అనేక అవార్డులు కొత్తగూడెం మున్సిపాలిటీకి తీసుకురావాలని ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన కమిషనర్ శేషాంజన్ స్వామి మేనేజర్ సత్యనారాయణ మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.