ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ గారిని గెలిపించండి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో లోక్ సభ ఎన్నికల్లో రాజ్యాంగ వ్యతిరేక శక్తులైన అగ్రకుల బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించి రాజ్యాంగ రక్షణ పార్టీ అయినధర్మ సమాజ్ పార్టీ వరంగల్ లోక్ సభ పార్లమెంట్ అభ్యర్థి మేకల సుమన్ గారికి చెప్పుల గుర్తు సీరియల్ నం 14 కి ఓటేసి గెలిపించాలని గణపురం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడారు. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరికీ బతుకునిచ్చిన భారత రాజ్యాంగాన్ని మరియు రిజర్వేషన్లని నాశనం చేసే కుట్రలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అనే మూడు పార్టీలు ఒకటేనని ఈ మూడు పార్టీలను నమ్మవద్దని ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బ్రాహ్మణ, బాణీయ, క్షత్రియ అగ్రకుల వంశస్థులే ఈ దేశాన్ని పరిపాలించారని కానీ బీసీ, ఎస్సీ ,ఎస్టీ మతమైనారిటీల బతుకులు ఏమాత్రం మారలేదని రామరాజ్యం పేరుతో బిజెపి పార్టీ 10 సంవత్సరాల కాలంలో అణగారిన వర్గాల ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని అదే బాటలో బిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో ఇక్కడ సబ్బండ వర్గాల ప్రజల బతుకులను ఆగం చేసిందని అదేవిధంగా ఈ దేశాన్ని అతి ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం పేరుతో అదే మోసం చేసిందని మళ్లీ ఈ మూడు పార్టీలు వేషాలు మార్చుకొని ఇంకా కొత్త లోకం తీసుకొస్తామని ప్రగల్బాలు పలుకుతూ విద్యా, వైద్యం, భూమి, ఉపాధి, ఇల్లు కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఈ మూడు పార్టీలు విఫలమైనవి పార్లమెంట్లో ఏ చట్టం చేసిన అగ్రకులాల మేలుకొరకు చేసుకొని మరొకసారి సబ్బండ వర్ణాల వారికి మోసం చేయాలని చూస్తోందని వీరిని నమ్మవద్దని చెప్పడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ గారి చెప్పుల గుర్తుకు ఓటేసి భారి మెజారిటీతో గారికి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్రీ స్వామినాథన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి జిల్లా ఉపాధ్యక్షులు కొగిల జితేందర్, జిల్లా కార్యదర్శి పొనగంటి సతీష్, మండల ప్రచార కమిటీ సభ్యులు ఇంజపెల్లి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!