సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
ప్రపంచ విప్లవ ఉద్యమాలకు రష్యా విప్లవ నేత లెనిన్ మార్గదర్శకుడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం చినపాక లక్ష్మీనారాయణ లు కొనియాడారు.
గురువారం మర్రిగూడ మండల కేంద్రంలో నీ భారత్ గార్డెన్స్ లో సిపిఎం మునుగోడు నియోజకవర్గం స్థాయి స్టడీ సర్కిల్ లెనినిజం పునాదులు అనే అంశంపై సిహెచ్ లక్ష్మీనారాయణ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో దోపిడి పీడన అసమానతలు లేని శ్రామిక వర్గ రాజ్యాన్ని నిర్మించడంలో లెనిన్ గొప్ప పాత్ర నిర్వహించారని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని నిర్మించడం కోసం లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ బోల్షివీక్ లు అశేష త్యాగాలు చేశారని అన్నారు. మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అనువదించడంలో ప్రపంచానికి అనేక అనుభవాలు రష్యా విప్లవం నుండి వచ్చాయని పేర్కొన్నారు.
మార్క్సిజాన్ని లెని నిజాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనువయించి పనిచేస్తున్న ఏకైక కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఅని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసి మతతత్వాన్ని రెచ్చగొట్టి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రజా వ్యతిరేక విధానాల అనుసరిస్తుందని విమర్శించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గోరి కట్టకపోతే రాబోయే కాలంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యనికి పెను ప్రమాదం పొంచి ఉందని
ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు చాయలు కమ్ముకున్నాయని ఇప్పటికే అనేక ఎకరాలలో పంట నష్టపోయిందని అలాంటి రైతాంగాన్ని సర్వే చేసి పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శిలు ఏర్పుల యాదయ్య ,మిర్యాల భగత్,మొగుదాల వెంకటేశం, సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్,వివిధ మండలాల నాయకులు సాగర్ల మల్లేష్, బాష్పాక మూతిలింగం,, యాసరాని శ్రీను, వేముల లింగస్వామి, కొమ్ము లక్ష్మయ్య, కొట్టం యాదయ్య, చిట్టిమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.