హన్మకొండ,జనవరి 17:-పెడదారి పడుతున్న యువతకు కనువిప్పు కల్గించే విధంగా రూపొందించిన ‘అమ్మ ఆక్రోశం’
షార్ట్ ఫిలిం షూటింగ్ మొదట బుదవారం హన్మకొండ నగరంలో ప్రారంభమైంది.హన్మకొండలోని ఆదర్శ లా కాలేజ్ లో కోర్టు సీన్ చిత్రికరించారు.అంతకుముందు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చేర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ కెమెరా స్వీచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం యూనిట్ కళాకారులు ఆయా పాత్రలలో లీనమై నటించారు.ఈ షార్ట్ ఫిలిం నకు తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్(తొమ్వాజా) రాష్ట్ర అధ్యక్షులు
అయిలు రమేష్ డైరక్షన్ చేయగా జడ్జి పాత్రలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి,టైపిస్టు పాత్రలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ ఫార్మర్ మెంబర్,ఢీంబాయ్ టీవీ న్యూస్ ఛానల్ సీఈవో వేముల సదానందం నేత నటించారు.
కెమెరా మెన్ గా కిషోర్ వ్యవహరించారు.పాత్రలు పాత్రదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆధ్యంతం సాగిన షూటింగ్ లో ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చేర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ సందేశాత్మక చిత్రాలు సమాజానికి దోహదపడతాయని అన్నారు.ఎదిగిన కొడుకులు,కూతుర్లు ప్రేమ పేరుతో వంచనకు గురై వివాహాలు చేసుకొని తల్లితండ్రులకు కడుపుకోత విధిస్తున్న తరుణంలో ఒక మద్యతరగతి కుటుంబానికి చెందిన ఒక తల్లి కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశంలో కోర్టు ఇచ్చిన తీర్పు సభ్యసమాజానికి కనువిప్పు కలిగించే విధంగా ఉందని బండా ప్రకాష్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు.పిల్లలు తల్లితండ్రుల ఆశలను ఆడియాశలు చేయకుండా చక్కగా ఉన్నత చదువులను అభ్యశించి ప్రయోజకులగా ఎదిన తర్వాత వివాహాల వైపు ఆలోచించాలని బండా ప్రకాష్ ముదిరాజ్ పిలుపు నిచ్చారు.చట్టాలను ఆసరా చేసుకొని మేజర్లమైనమని యువత తప్పుడు నిర్ణయాలు తీసుకోరాదని,భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని యువత ముందుకు సాగాలని బండా ప్రకాష్ ముదిరాజ్ సూచించారు.