
గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపల్ న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం శనివారం మహబూబాబాద్ అడిషనల్ జె ఎఫ్ సి ఎం ఏ. కృష్ణ తేజ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు సుమారు 150 మంది పిల్లలకు చట్టాలపై అవగాహన మరియు రాగింగ్. గంజాయి డ్రగ్స్ ఆల్కహాల్ వంటి దురాలవాట్లు చేసుకోవద్దని చదువుపై శ్రద్ధ చూపాలని షీ టీమ్స్ డయల్ 100, బాల్యవివాహాలు మొదలగు అంశాలపై అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండి అజీమ్ మరియు గురుకులం ప్రిన్సిపాల్ కె,
హర్షిత స్థానిక ఎస్సై మురళీధర్ రాజు సెకండ్ ఎస్సై నరేష్ సిబ్బంది పాల్గొన్నారు