
యూరియాతో పాటు ఏ ఇతర ఎరువులను కొనాలని ఇబ్బంది పెట్టిన చట్టరీత్యా చర్యలు.
డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్ పాక గోపాలపూరు గ్రామంలో శుక్రవారం రోజున భూపాలపల్లి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ రమేష్ ఎరువుల దుకాణాలను అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువులను కొనేటప్పుడు బిల్లు ఇవ్వాలని అలాగే యూరియాతోపాటు ఎరువులను కొనాలని బలవంతం చేసిన వ్యవసాయ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు, షాపు యజమానులు స్టాక్ రిజిస్టర్ ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో పెట్టాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఏఈఓ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.