
Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్‌ను డి-అడిక్షన్/రిహాబిలిటేషన్ సెంటర్, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో సోమవారం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ తెలియజేశారు..ఈ సందర్భంగా రాధిక జైస్వాల్ మాట్లాడుతూ గౌరవ సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి.పి.నీరజ మార్గదర్శకత్వంలో, DM&HO శ్రీమతి.రజిత సమన్వయంతో మరియు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ.గీతే మహేష్ బాబాసాహెబ్ గారి అనుమతితో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతోజు భాస్కర్, లోక్ అదాలత్ సభ్యులు, .ప్రవీణ్, మానసిక వైద్య నిపుణులు, మణివర్మ, మెడికల్ ఆఫీసర్, ఈ. స్వాతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.