Legal Action Demanded Against Migrants in Agencies
ఏజెన్సీలొ వలసవాదులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి
ఎఎస్పీ డిమాండ్.
గుండాల,నేటిధాత్రి:
ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ గుండాల మండలం పర్యటన లొ భాగంగా మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.మండల అధ్యక్షులు పూనెం రమణబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నైతం బాలు మాట్లాడుతూ ఏజెన్సీలో భూ బదలాయింపు 1/70 చట్టం ఉన్నాప్పటికీ మండలంలో మైదాన ప్రాంత గిరిజనేతరులు వలసలు విపరీతంగా వస్తు ఇక్కడ భూములు అధిక ధరలకు కొనుగోలు చేస్తూ ఇక్కడే వ్యాపారాలు నిర్వహిస్తున్న అధికార్లు చోద్యం చూస్తున్నారు. వాళ్ళమీద ఎల్టీఆర్ కేసులు పెట్టి సుమోటో కేసుగా పరిగణంలోకి తీసుకోవాలి గిరిజనేతరులు కొన్న భూములు ప్రభుత్వం హస్తగతం చేసుకోవాలి అని డిమాండ్ చేశారు. వలస వాదులకు ఓటు హక్కు కల్పిస్తే స్థానిక ఆదివాసులు మైనరిటీలో ఉంటారు. చట్టాలు కోల్పోయే ప్రమాదం ఉంది అధికార్లు వలస వాదులపైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లొ, రాఘబోయినగూడెం సర్పంచ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఈసాల సురేష్. రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు. జిల్లా అధ్యక్షులు విసి దొర,జిల్లా ఉపాధ్యక్షులు బట్టు కనకరాజు,మండల కార్యదర్శులు గోగ్గేలా సుధాకర్, జబ్బ సుదర్శన్,గోగ్గేలా శేఖర్, గోగ్గేలా సూర్యనారాయణ, ముత్తాపురం సర్పంచు కల్తీ రాద,బొర్ర కళ్యాణి, వీరభద్రం,మల్లయ్య, రామ నాదం,తదితరులు పాల్గొన్నారు.
