https://epaper.netidhatri.com/
`నగరం నడిబొడ్డునే సరసవిలాసాలు?
`వయసు మళ్లినా సరే..అక్కడికెళ్లాక యువకులే!
`అంతా గొప్ప వాళ్లే…గుడి ఎనక నా సాములే?
`పెద్ద పెద్ద మనుషుల లీలలు!
`ప్రజా సేవలో తలమునకలయ్యే వారక్కడ సేద దీరుతారు?
`ప్రజా సేవ చేసి, చేసి అలసిపోయిన వారు అలసట అక్కడ తీర్చుకుంటారు!
`వాళ్ళూ వీళ్లనే తేడా అక్కడ లేదు!
`అందరూ ఆ తాను ముక్కలే!
హైదరబాద్,నేటిధాత్రి:
ఎంత నేర్చినా…ఎంతా జూచినా ఎంత వారలైనా కాంత దాసులే…అని త్యాగరాజు అన్నట్లు… పేరుకు ఎంతో వాళ్లెంతో పెద్ద మనుషులు…వయసు మీద పడిన వారు…అయితేనేం…గుట్టు చప్పుడు కాకుండా గుడిసేటి ఏశాలు ఏస్తున్నారు! అదో మాయా ప్రపంచం… కానీ సరస సల్లాపాలను అందించే కామ లోకం…అంతా అక్కడ అంతా మధ్యవర్తి వంశీకరణ మాయ జాలం… సినీ మాయ మత్తులో పడిన అమాయక ఆడపిల్లలు. వంశీకరణ వశంలో పాపం అమాయక యువతులు…వలలో చిక్కిన చేప పిల్లల లాగా, వంశీకరణ చక్రం ఆధీనంలో వుంటారు. దాంతో ఆ అమ్మాయిలు అతను చెప్పింది చేయాలి.. చేస్తారు. సినిమా అవకాశాల కోసం, వెండి తెరమీద వెలిగిపోదామనుకొని వచ్చే ఇలాంటి యువతలు ఎంతో మంది నలిగిపోతున్నారు. అవసరాల కోసం అవకాశవాదుల వలలో చిక్కుతున్నారు. ఎన్నటికైనా సినీ అవకాశాలు అందకపోతాయా? అప్పటి దాకా పొట్ట తిప్పలు కోసం వారికి తప్పడం లేదు. దాంతో వాళ్లు మన కాంత దాసులైన నాయకులకు సేవలు చేసి తరిస్తారు. అబ్బో ప్రజా సేవలో నిత్యం తలమునకలై, ఊపిరి సలపనంత పనిలో నిమగ్నమై, విశ్రాంతికి తీరిక లేని కొందరు నేతలు అలసట తీర్చుకుంటారు. సంతోషంగా సేద దీరుతుంటారు. మరి అలాంటి ఆనందం కోసం ఆ పార్టీ, ఈ పార్టీ అనే నాయకులన్న తేడా! లేదు? అక్కడ అందరూ దోస్తులే…నువ్వా…గదిలో…నేనీ..గదిలో అనుకుంటు, ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు. రాజకీయాల విషయం వచ్చే సరికి ఎవరికి వారు ఎంతో పత్తిత్తులుగా విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటారు. పత్తాపారాలు మాత్రం చెప్పుకోరు. ఎందుకంటే అందరూ తేలు కుట్డిన దొంగలే…!
నాయకుల చీకటి బాగోతాలు…త్వరలో మీ నేటిధాత్రి లో...