
#Murthuza #BirthdayCelebration #BRS #Jahirabad #PoliticalLeaders #MassLeader #PublicService
యువ నాయకులు ముర్తుజ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
యువ నాయకులు ముర్తుజ గారి జన్మదినం సందర్బంగా,శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన, బిఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జహీరాబాద్ పరిధిలో ముర్తుజ సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహా నాయకుడని కీర్తించారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు ముర్తుజ అని కొనియాడారు. నిరంతరం జహీరాబాద్ పట్టణంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని, రాబోవు రోజుల్లో రాజకీయంగా అనేకమైన ఉన్నతమైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ నాయకులు చిన్న రెడ్డి,దీపక్ అలి,సలీం అర్షద్,ఆసిఫ్ తదితరులు,