జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో శనివారం రోజున ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఇందారం లోని ఓపెన్ కాస్ట్ గనికి వెళ్లే దారిలో వెలుతురు లేక డ్యూటీ కి వెళ్లే కార్మికులు చీకట్లోఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని గని చుట్టూ వాతావరణం దుమ్ము ధూళితో నిండి ఉండటం వలన ముందు వెనక ఏమొస్తుందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గనికి వెళ్లే దారికి ఇరువైపులా మరియు రహదారిపై కూడా లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇందారం గ్రామ మెయిన్ రోడ్డు దగ్గర గ్రామపంచాయతీ కమాన్ బోర్డు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన ఇందారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ కార్మికుల ఇబ్బందుల్ని పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటామని వినతిలో తెలిపిన విషయాలను వెంటనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు బేధ మల్లేష్ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.