ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
మానవ సేవయే మాధవ సేవా గా భావించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ధర్మారం మండలం కొత్తూరు గ్రామ వాస్తవ్యులు కొలుముల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ కెనడా నుండి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గొర్రెల కాపల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, ముచ్చర్ల కొమురయ్య యాదవ్, ధర్మారం మండల యాదవ సంఘం నాయకులు జంగ మహేందర్ యాదవ్, సంగ రంజిత్ యాదవ్,జెల్ల సంపత్ యాదవ్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో యాదవుల సమస్యలు, పరిస్థితుల గురించి, రాజకీయ పార్టీల పరిస్థితుల గురించి చర్చించారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపోటములను శాసించే స్థాయిలో యాదవ జనాభా ఉన్నప్పటికీ, ఆయా రాజకీయ పార్టీల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, నవంబర్ మొదటి వారంలో ధర్మపురి నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించారు.