భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్ల సిపియుఎస్ ఐ కార్యాలయంలో విప్లవ పార్టీల ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఐఎఫ్టియు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ చంద్రగిరి శంకర్ సిపియుఎస్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ పాల్గొన్నారు అనంతరం మారపల్లి మల్లేష్ విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ప్రజలు ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విప్లవ పార్టీల తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం
ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం రానున్న సింగరేణి ఎలక్షన్లలో విప్లవ పార్టీల సంఘాల నాయకులను గెలిపించుకోవాలి జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదల పక్షాన నిరుద్యోగుల పక్షాన కార్మికుల పక్షాన సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యల కోసం విద్య ఉపాధి కోసం రైతాంగ సమస్యల కోసం వ్యవసాయ కూలీల సమస్యల కోసం కౌలు రైతుల సమస్యల కోసం
పవన నిర్మాణ కార్మికుల కై నిరంతరం ప్రజల పక్షాన హక్కుల సాధన నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో సిపియుఎస్ఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జాడిగట్టన్న
సిపిఐ ఎంఎల్ లిపరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఆకునూరి జగన్ కసరవెల్లి కుమార్ సాద శ్రీనివాస్ దారకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు