పెద్దపల్లి ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ గౌడ సంఘం సభ్యులంతా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు కు గౌడ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు.గౌడ సంఘం కమ్యూనిటీ హాల్,ఆర్ ఎన్ బి రోడ్డు నుండి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు సీసీ రోడ్డు కోసం వినతి పత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన
ఎమ్మెల్యే త్వరలోనే పనులు మంజూరు చేస్తా మని చెప్పడంతో గౌడ సంఘం నాయకులు,సభ్యులు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు సిరిసేటి శ్రీనివాస్ గౌడ్,కమిటీ సభ్యులు మాచర్ల రమేష్,నల్లగోని వెంకటేష్ గౌడ్,సిరిసేటీ సదానందం,సింగిల్ విండో ఛైర్మెన్ ఆళ్ళ సుమన్ రెడ్డి మరియు గౌడ సంఘం కుల సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *