
Leaders of the AITUC Recognition Committee visited the IK1A mine.
ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని ఇందారం 1ఎ గని లో ఏఐటియుసి కార్మిక నేతలు సందర్శించారు.శనివారం గనిలోని అన్ని విభాగాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలను పరిష్కరించాలని గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు.వారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కంది కట్ల వీరభద్రయ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో రక్షణ పరికరాలు,పనిముట్లు అందుబాటులో ఉంచాలని,వేసవికాలం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని,ఓసి లోని పలు సమస్యలు పరిష్కరించాలని వివిధ అంశాలపై మేనేజర్ తో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాబా సైదా,సహాయ కార్యదర్శి మోత్కూర్ కొమరయ్య,ఫిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.