నేటిధాత్రి, వరంగల్
వరంగల్ మట్టెవాడ సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసిన సన్మానం చేయడం జరిగింది. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ సిటీలో ఎక్కడ కూడా అక్రమాలు అన్యాయాలు జరగకుండా చూస్తానని ప్రజలందరూ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఈసంపెళ్లి సంజీవ, ప్రధాన కార్యదర్శి మంద శ్రీధర్ రెడ్డి హన్మకొండ జిల్లా అధ్యక్షులు కలకొట్ట్ల జయరాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు చీకటి కుమార్, గుండా రమేష్, హరిచంద్రునాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు బోల్లం సంజీవ, నాయకులు దిడ్డి సదానందం పాల్గొన్నారు