మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని చిన్న పొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన విషయం అందరికి తెలిసిందే ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాసంఘాల నాయకులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులని పరామర్శించరు. అనంతరం స్థానిక జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ని కలిసి,మెమోరండం ఇయ్యడం జరిగింది. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా మరియు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు అదేవిధంగా దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో ప్రజాసంఘాల డిమాండ్..ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాసంఘాల నాయకులు అందరు కూడా పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో కామారం వెంకటేష్ యాంకి రమేష్ రామన్న మాదిగ అమిలికుంట్ల శ్రీనివాస్ గండీడ్ చెన్నప్ప మద్దూర్ మ్యాథరి కృష్ణ, హనుమాన్ పల్లి చిన్నికృష్ణ,బోరు కృష్ణయ్య పల్లెర్ల దుబాయ్ కృష్ణ,రంగారెడ్డి పల్లి వివేక్ నందిపాడు కనుకప్ప గుర్రంపల్లి లింగని నర్సింలు ఉట్కూర్ భరత్ కుమార్ మక్తల్ శివరాజ్ మక్తల్ దశరత్ గుండుమాల్ బాబన్న గుండుమాల్ బర్రె కృష్ణ పల్లెర్ల సాయికుమార్ నందిపాడు కృష్ణయ్య మూసాపేట్ కొండన్న గుండుమల్ దస్తయ్య కడంపల్లి సతీష్ కడంపల్లి దాసు మల్లపూర్ వెంకటయ్య మల్లపూర్ శీను ఉజ్జెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.