
రాజన్న సిరిసిల్ల జిల్లా(ఎల్లారెడ్డిపేట) నేటిధాత్రి
ఎల్లారెడ్డిపేట మండలంలో నూతనంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి గుండారం గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లిన ఎంపీడీవో సత్తయ్య ని సన్మానించిన యువజన మండల అధ్యక్షుడు బానోతు రాజు నాయక్.ఎంపీడివో తో పాటు స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన వజీర్ మరియు కార్యదర్శి సంజీవ్ ని సన్మానించడం జరిగింది. వాటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ శాఖ మాత్యులు ధనసరి సీతక్క (అనసూయ)ఫోటోలను గ్రామపంచాయతీలో ఉండే విధంగా బహుకరించడం జరిగింది. వీరితోపాటు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేందర్, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మున్సిన్ రాథోడ్, ప్రశాంత్, శ్రీకాంత్ రాథోడ్,న్యాలపల్లి కిషన్ చారి,గంగారం నాయక్, మూడవథ్ సీను,లాలా దేవయ్య,భూక్య జగ్మల్, లచ్చిరామ్ నాయక్,జయరాం నాయక్,గరిగే కిషన్,బానోతు రాజు తదితరులు పాల్గొన్నారు.