Tributes Paid to Chennappa Patel on Death Anniversary
విగ్రహాలకు పూలమాలలు వేసి, జరుపుకున్న చెన్నప్ప పటేల్ వర్ధంతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరసంగంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు అభిమానులు చెన్నప్ప పటేల్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతోష్ పటేల్, చెన్నప్ప పటేల్ మనవలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఝరసంగంలోని చెన్నప్ప పటేల్ కాలనీలో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
