లక్షెటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
భావి తరాలకు సంప్రదాయ కళలపై అవగాహన కల్పించేందుకు, వివిధ రకాల కళల్లో రాణిస్తున్న విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో మంచిర్యాల కేంద్రం సైన్స్ సెంటర్లో గురువారం రోజున కళా ఉత్సవ్ – 2023 జిల్లా స్థాయి పోటీలను జిల్లా సెక్టోరియల్ అధికారి కె. చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్ధానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల / కళాశాల విద్యార్థినులు కుమారి టీ అలేఖ్య (ఒకేషనల్ రెండవ సంవత్సరము) శాస్త్రీయ గాత్ర సంగీతం విభాగంలో, కుమారి జే . నిస్సి (9వ తరగతి) శాస్త్రీయ వాద్య సంగీత విభాగంలో రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైనట్టు, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఎం. లలిత కుమారి తెలియజేశారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థినులు ఇరువురిని, వీరిని సంగీత విభాగంలో ప్రోత్సహించి శిక్షణ ఇస్తున్న సంగీతం ఉపాధ్యాయురాలు శ్రీమతి ఇందారపు శివప్రియను.. ప్రిన్సిపాల్ గారితో పాటు వైస్ ప్రిన్సిపల్ శ్రీ కె మహేశ్వర రావు జూనియర్ వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి జి మౌనిక, ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందిన ఇరువురు విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీలకు పంపించడానికి సిద్ధము చేయనున్నట్టు ప్రిన్సిపల్ లలిత కుమారి ఈ సందర్భంగా తెలియజేశారు.