
Sedition Case Demand on Lawyer Attacking Chief Justice
సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన లాయర్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య
మొగులపల్లి నేటి ధాత్రి
భారతదేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పైకి ఓ మతోన్మాద అడ్వకేట్ రాకేష్ కిషోర్ షూ విసిరేసి చేసిన దాడి ప్రజాస్వామ్య రాజ్యాంగం పైన జరిగిన దాడిగానే బావిస్తూన్నామని , అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్బంగా జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య మాట్లాడుతూ భారతదేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పైకి అడ్వకేట్ రాకేష్ కిషోర్ షూ విసిరి దాడికి ప్రయత్నించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు . భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్.గవాయి పై దాడికి పాల్పడిన ఢిల్లీ కోర్టు న్యాయవాది రాకేష్ కిశోర్ పై దేశ ద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ సంఘటన ను అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు . నిమ్న జాతి వర్గానికి చెందిన వ్యక్తి భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేయడం గిట్టని మతోన్మాది ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. సిజెఐ బిఆర్ గవాయి పై ఇలాంటి మతోన్మాద ఉన్నత చదువులు చదివిన రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ సభ్య సంస్కారం లేకుండా షూ విసిరి అవమాన పర్చిన అడ్వకేట్ ఆ వృత్తికే గౌరవం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ముఖ్యంగా దీనికి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని నిరూపించు కోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి రాజేందర్, మండల నాయకులు వంతడుపుల సారంగపాణి, జీడి సంపత్, బండారి రాజు, అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్ , బండారి బిక్షపతి, చెరిపెల్లి సురేందర్, బండారి రాజయ్య, బండారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.