312 ప్రభుత్వ పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్న
కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్
కొడంగల్, డిసెంబర్ 6, శుక్రవారం:
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పౌష్టికాహార అల్పాహార పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొమ్రాస్‌పేట్, దుద్యాల్, దౌల్తాబాద్ మండలాలతోపాటు నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లోని 312 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 28,000 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థులకు అల్పాహారం కొత్తగా నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ నుండి తయారు చేయబడుతుంది మరియు పంపిణీ చేయబడుతుంది. అల్పాహార కార్యక్రమం ప్రారంభం మరియు సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రులు Sri Damodar Rajanarasimha, Sri D. Sridhar Babu and Sri Jupally Krishna Rao సమక్షంలో in the presence of various Dignitaries and Guests and was Presided by Sri Satya Gaura Chandra Dasa Prabhuji, President – Hare Krishna Movement and Smt. Michelle Dominica, Head of India CSR and Administrative Services, Viatris. ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ అన్ని పాఠశాల పని దినాలలో వేడి మరియు పౌష్ఠికమైన బ్రేక్‌ఫాస్ట్‌లను అందించడానికి ఆధునిక సాంకేతికత మరియు అధునాతన ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించుకుంటుంది.
ఈ వంటశాల తెలంగాణ ప్రభుత్వం మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) లో భాగంగా పలు ప్రఖ్యాత సంస్థల ఉమ్మడి కృషి ఫలితం. తెలంగాణ ప్రభుత్వం కొడంగల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్రీకృత కమ్యూనిటీ వంటశాలను ఏర్పాటు చేసేందుకు 22,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. 1 సంవత్సరం పాటు 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 28,000 మంది విద్యార్థులకు వయాట్రిస్ సంస్థ ద్వారా అల్పాహారం అందించబడుతుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వంటగది నిర్మాణానికి ఉదారంగా సహకారం అందించింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) ఈ కిచెన్ నుండి బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తుంది మరియు ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ యొక్క నిధుల కోసం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (T-SIG) సమన్వయకర్తగా సేవలందిస్తుంది.
పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, దాతలు, ప్రభుత్వ అధికారులు మరియు హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ కార్యకర్తల సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు మరియు నిరుపేదల శ్రేయస్సు కోసం ఉద్దేశించిన కార్యక్రమాలకు మద్దతునిస్తూ, ప్రభుత్వానికున్న నిబద్ధతను నొక్కిచెబుతూ, Sri Damodara Rajanarasimha, Hon’ble Minister of Health, Medical and Family Welfare,
Science and Technology,
Sri Duddilla Sridhar Babu, Hon’ble Minister of Information Technology,
Electronics and Communication, Industries, and Commerce and Legislative Affairs
Sri Jupally Krishna Rao, Hon’ble Minister of Prohibition and Excise ; Tourism and
Culture and Archaeology, గారు వంటశాలను ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, తెలంగాణ అధ్యక్షులు శ్రీ సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ అధ్యక్షత వహించగా, శ్రీమతి. మిచెల్ డొమినికా, ఇండియా CSR మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ హెడ్, వయాట్రిస్; శ్రీ ఎన్. బలరామ్, IRS, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్; శ్రీ ప్రతీక్ జైన్, IAS, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, వికారాబాద్ మరియు శ్రీ K. వెంకట్ రెడ్డి, ప్రత్యేక అధికారి, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA), శ్రీమతి అర్చన సురేష్, డైరెక్టర్, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (T-SIG), మరియు ఇతర ప్రముఖులు, అతిథులు పాల్గొన్నారు.
గౌరవ అతిథులు :
Dr. T Ram Mohan Reddy, Hon’ble Member of the Legislative Assembly, Pargi
Sri R Gurunath Reddy, Chairman, TG State Police Housing Corporation
Sri Rajesh Reddy, Chairman, Zilla Grandhalayam, Vikarabad
Sri Varla Vijay Kumar, Chairman, Zilla Grandhalayam, Narayanapet
Sri R. Jagadeeshwar Reddy, Chairman, Kodangal Municipality
Smt. K Annapurna, Chairperson, Kosgi Municipality
Sri Patnam Ambaiah Goud, Chairman, AMC Kodangal
కార్యక్రామానికి విచ్చేసిన ప్రముఖులు, అతిథులందరూ ఫౌండేషన్‌కు చెందిన ముఖ్య కార్యదర్శులతో పాటు వంటశాలను సందర్శించారు. అక్కడ కొనసాగే సమగ్ర వంట ప్రక్రియలను గూర్చి వారికి వివరించడంతో పాటు వంటశాల రూపకల్పనలో సమర్థవంతంగా ఉపయోగించిన అత్యాధునిక సాంకేతికతను, వివిధ సౌకర్యాలను కూడా అందరికీ పరిచయం చేశారు.
ఈ ఉచిత అల్పాహార కార్యక్రమం ప్రాథమికంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు వేడి వేడి, రుచికరమైన మరియు పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించేందుకు నిర్దేశితమైంది. తద్వారా, పోషకమైన మరియు సమతుల్య ఆహారాన్ని అందించడంతో పాటు, విద్యార్థులలో సరైన ఎదుగుదలకు చేయూతనిస్తూ, పేద పిల్లలను సుసంపన్నం చేయడంలో సహాయపడుతుంది.
గౌరవనీయులైన మంత్రి గారు మాట్లాడుతూ, “నాణ్యమైన విద్య ద్వారానే సమాజాభివృద్ధి, అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ కృషి అభినందనీయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని గౌరవనీయులైన కేబినెట్ మంత్రులు తెలియజేశారు. హరే కృష్ణ ఉద్యమం యొక్క మానవతా మరియు స్వచ్ఛంద సేవలను వారు ప్రశంసించారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు మరియు ఇతర లబ్ధిదారులకు పోషకమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడాన్ని ప్రత్యేకంగా శ్రీమతి. మిచెల్ డొమినికా, భారతదేశ CSR మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, Viatris, వారి ఉదార సహకారం కోసం మరియు వారి చొరవను మరియు, పథకం అమలు కోసం అందరూ చేసిన కృషిని అభినందించారు.
హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ (M.Tech, IIT చెన్నై) మాట్లాడుతూ, “హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ నిరుపేదలకు భోజన-అమృతం, అన్నపూర్ణ (రూ. 5 భోజన కార్యక్రమం), సద్దిమూట, స్వాస్థ్య ఆహారం మొదలైన కార్యక్రమాలను ప్రారంభించింది. మాకు బలమైన మద్దతు మరియు ప్రోత్సాహం అందించినందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదములు. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గౌరవనీయులైన కేబినెట్ మంత్రులు మరియు ఇతర ప్రముఖులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)కి కట్టుబడి ఉన్నందుకు మరియు ఉచిత అల్పాహార పథకానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం ద్వారా సమాజంలో సానుకూల మార్పును పెంపొందించడానికి వయాట్రిస్‌కు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కంపెనీలు తమ వ్యాపార లక్ష్యాలతో పాటు సామాజిక ప్రభావానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కిచెన్ నిర్మాణంలో ఉదారంగా మద్దతు ఇచ్చినందుకు సింగరేణి కాలరీస్‌కు మరియు సహకార సేవలకు T-SIGకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ వికారాబాద్ మరియు నారాయణపేట జిల్లాల్లోని అనేక మంది నిరుపేదలకు సేవలందిస్తుంది, తద్వారా “తెలంగాణ రైజింగ్” థీమ్‌కు మా వినయపూర్వకమైన సహకారాన్ని అందజేస్తుంది.”
ఈ సందర్భంగా శ్రీమతి మిచెల్ డొమినికా, ఇండియా CSR మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ హెడ్, వయాట్రిస్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరంలో నివసిస్తుంది. ప్రతి పాఠశాల విద్యార్థి ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనంతో వారి రోజును ప్రారంభించేలా చేసే ఉచిత అల్పాహార పథకం యొక్క ఈ చొరవకు మద్దతు ఇవ్వగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము మరియు వారి ఉజ్వల భవిష్యత్తుకు సహకరించడం మా అదృష్టంగా భావిస్తున్నాము.”
వారంలోని ప్రతి రోజు వివిధ రకాల రుచికరమైన అల్పాహార వంటకాలను అందించేందుకు ప్రత్యేకమైన బ్రేక్‌ఫాస్ట్ మెనూ రూపొందించబడింది.
వారం | అల్పాహారం మెను |
సోమవారం | ఇడ్లీ, సాంబారు |
మంగళవారం | పూరీ, ఆలూకుర్మా |
బుధవారం | ఉప్మా, సాంబార్ |
గురువారం | మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ |
శుక్రవారం | ఉగ్గాని / పొంగల్, చట్నీ |
శనివారం | బోండా, చట్నీ |
కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ ఆహారాన్ని వండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో 15 నిమిషాల్లో 1,000 మంది విద్యార్థులకు సరిపడా అన్నం, 2 గంటల్లో 5,000 మంది విద్యార్థులకు రుచికరమైన సాంబార్‌ను సిద్ధం చెయ్యొచ్చు. ఇడ్లీ తయారీ యంత్రం 15 నిమిషాల్లో 1020 వేడి వేడి ఇడ్లీలను ఉత్పత్తి చేయగలదు. అదే విధంగా పూరీ తయారీ యంత్రం ఒక గంటలో 2000 పూరీలను ఉత్పత్తి చేస్తుంది. అంతేగాక, ఈ వంటశాల బయో-గ్యాస్ తయారీ ప్రక్రియలో ఉత్పత్తి చేయబడిన బయో వ్యర్థాలను ఉపయోగిస్తుంది. వంట కోసం ఉపయోగించే నీటిని RO ప్లాంట్‌లో శుద్ధి చేస్తారు. వ్యర్థాలను సమర్థవంతంగా పునర్వినియోగించేందుకు ఒక బాయిలర్ ప్లాంట్ మరియు గ్యాస్ బ్యాంక్‌తో పాటు ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటుచేయబడింది. వండిన ఆహారం వేడిగా మరియు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా రుచికరంగా ఉండేలా చూసేందుకు, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రతి ఒక్క రోజుకూ వివిధ రకాల మెనులను రూపొందించింది.
గౌరవనీయులైన మంత్రులు, దాతలు మరియు ఇతర ప్రముఖులు పాఠశాల పిల్లలకు అల్పాహారం మరియు ఇతర వంటకాలను వడ్డించడంతో కార్యక్రమం ముగిసింది.
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్‌చే ప్రారంభించబడిన హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) ప్రభుత్వంచే గుర్తించబడిన రిజిస్టర్డ్ ట్రస్ట్. సంస్థ కార్యకలాపాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి వున్నాయి. “మా కేంద్రం నుండి 10-మైళ్ల పరిధిలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు” అనే ఏకైక లక్ష్యంతో, HKMCF ప్రధానంగా దాతల భాగస్వామ్యంతో ఆసుపత్రులు, మార్కెట్ యార్డులలో ఉచిత ఆహారాన్ని అందించడం, ప్రభుత్వ సహకారంతో అవసరమైన వారికి సబ్సిడీ ఆహారాన్ని అందించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ట్రస్ట్ స్థాపించిన అత్యాధునిక కేంద్రీకృత కమ్యూనిటీ వంటశాలల ద్వారా భోజనామృత, సద్దిమూట, అన్నపూర్ణ (మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల భాగస్వామ్యంతో ఐదు రూపాయల భోజన పథకం) కార్యక్రమాల ద్వారా ప్రతిరోజూ సుమారు 40,000 మందికి భోజనాలను అందిస్తుంది. ట్రస్ట్ గత 11 సంవత్సరాలలో సుమారు 16 కోట్ల భోజనాలను అందించి ఎన్నో లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది.
వయాట్రిస్ ఇంక్., మైలాన్ మరియు అప్‌జాన్‌ల కలయికతో ఏర్పడిన ఈ సంస్థ, జెనరిక్స్ మరియు బ్రాండ్ ఔషధాల మధ్య గల తారతమ్యతను తగ్గించి, రెండింటిలోనూ వున్న ఉత్తమ స్వభావాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ అవసరాలను మరింత సమగ్రంగా పరిష్కరించేందుకు ఏర్పడిన ఒక గ్లోబల్ హెల్త్‌కేర్ సంస్థ. జీవితంలోని ప్రతి దశలో ఆరోగ్యంగా జీవించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో సాధికారతను పెంపొందించే లక్ష్యంతో విస్తృత సౌలభ్యాన్ని కల్పిస్తూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ రోగులకు అత్యంత నాణ్యమైన ఔషధాలను సరఫరా చేస్తూ, జననం నుండి మరణం వరకు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి తీవ్రమైన పరిస్థితుల వరకు జీవితంలోని ప్రతి స్థాయిలోనూ తోడ్పాటునందిస్తోంది. విస్తృతమైన మరియు విభిన్నమైన ఔషధాల పోర్ట్‌ఫోలియోతో, ఎప్పుడు ఎక్కడ ప్రజలకు అవసరమైనా, అక్కడ వెంటనే చేరువయ్యేలా రూపొందించబడిన ప్రపంచవ్యాప్తమైన సరఫరా వ్యవస్థను కలిగిన ఈ సంస్థ, తమ శాస్త్రీయ పరిజ్ఞాన నైపుణ్యంతో ప్రపంచంలోని కఠినమైన ఆరోగ్య సమస్యలలో కొన్నింటిని పరిష్కరించడానికి కృషి చేస్తోంది. వయాట్రిస్ ప్రధాన కార్యాలయం U.S.లో ఉండగా, పిట్స్‌బర్గ్, షాంఘై మరియు భారతదేశంలోని హైదరాబాద్ నగరాలలో కేంద్రాలు నెలకొల్పబడ్డాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), అన్నది తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం 51:49 నిష్పత్తిలో యాజమాన్య వాటాను కలిగి సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ బొగ్గు గనుల సంస్థ. దక్షిణ భారతదేశంలోని ఏకైక బొగ్గు నిక్షేపాలను కలిగున్న గోదావరి లోయ ప్రాంతాన్ని అన్వేషించి బొగ్గును సేకరించడం సంస్థ నిర్వహిస్తుంది. SCCL తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం ద్వారా దేశం యొక్క సామాజిక మరియు ఆర్థిక వృద్ధికి కృషి చేస్తోంది. ప్రాథమిక సేవలు (తాగునీటి సరఫరా, పారిశుధ్యం మొదలైనవి), ఆరోగ్యం, విద్య, జీవనోపాధి మరియు స్థానిక ఆర్థికాభివృద్ధి వంటి దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో సంస్థ తమ CSR విధానాలను రూపకల్పన చేశాయి.
ధన్యవాదాలు,
పి.ఆర్. ఇంచార్జ్,
మొబైల్: 96400 86664, 93964 16341
హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, హైదరాబాద్