Karthika Amavasya Crowds at Shekhapur Temple
శేఖపూర్ ఆలయంలో కార్తీక మాసం చివరి అమావాస్య వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని శేఖపూర్ ఆంజనేయ స్వామి మరియు శివాలయంలో కార్తీక మాసం చివరి అమావాస్య కావడంతో.. ఓవైపు దేవస్థాన ప్రాంగణ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి అమావాస్య కావడంతో శేఖపూర్ ఆంజనేయ స్వామి వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి శివాలయంలో కార్తీక మాసం చివరి అమావాస్య ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. ఆంజనేయ స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
