భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం శుక్రవారం నాడు ఐటీడీఏ ఆవరణలో ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా గిరిజనులు మరియు ఆదివాసులు సన్న చిన్న కారు పేద ఆయకట్టు రైతులు వ్యవసాయం సాగుచే స్తున్నారని ప్రభుత్వ చెరువులు గాని ప్రవేట్ చెరువులు ప్రాజెక్ట్ కెనాల కాలువలు పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు రైతు భూములకు నీరు సరఫరా చేయుటకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేశారని అందులో ముఖ్యంగా భద్రాచలం పినపాక అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రైతులకు మరియు ఈ ప్రాంతమ్ ఏజెన్సీ ప్రాంతం అయినందున నిరుద్యోగ ఆదివాసీ యువకులకు ముందుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈయొక్క కార్యక్రమంలో ఆదివాసి లాయర్స్ ఫోరం చీమల నరసింహారావు కోర్ష కృష్ణార్జునరావ్ కోర్ష నరేష్ ఇ ర్ప ప్రకాష్ వజ్జ నరసింహారావు పూనెం వరప్రసాద్ కాక సురేష్ తదితరులు పాల్గొన్నారు