భూమి లేని పేద దళిత కుటుంబాలకు భూములు పంపిణి చెయ్యాలి.

విముక్త చిరుతల పార్టీ డిమాండ్.

చిట్యాల, నేటిధాత్రి;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చైన్ పాక గ్రామంలో శుక్రవారం రోజు న విముక్తి చిరుతల పార్టీ ఆధ్వర్యంలో భూమి లేని దళిత కుటుంబాలను విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. జీలుకర శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామాల్లో దళితులు అనుభవిస్తున్న సమస్యలు, భూమిలేని దళిత నిరుపేదలను సర్వే చేస్తున్నామని విముక్త చిరుతల పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు అంబాలా అనిల్ తెలిపారు, సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేక ఉపాధిలేక కూలీ పనిపై కుటుంబాలు ఆధారపడి రెక్కల కష్టం చేసే దళిత ప్రజలు వాడల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో దళిత పల్లెల్లో సర్వే నిర్వహించి సర్వే లో రాసుకున్న ఆధారాలను అన్ని జిలాల్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్సుల్లో ఆయా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవాలని మరియు అన్ని మండలాల్లో ఉన్న ఏమార్వో కి మరియు ఆయా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయీసమస్యలు పరిష్కరిస్తామని అన్నారు, అలాగే దళిత ఉపకులాలకు ఉన్న సమస్యలు సర్వే చేసి జిల్లాలో ఉన్న అధికారులకు అందజేస్తామని అన్నారు దాంట్లో భాగంగానే చిట్యాల మండలం చైన్ పాక గ్రామం లో ఉన్న దళితుల ఎంత మంది, ఎన్ని భూమి లేని కుటుంబాలు ఉన్నాయో సర్వే చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ మరియు గ్రామ దళిత ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *