భూమి ఆక్రమించిన
వారిపై చర్యలు తీసుకోవాలి
పోలీస్ అధికారులు చర్య తీసుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు శెట్టి మోహన్, కొయిడ ఎల్లయ్య, వెంకటేశ్, రాజారాం, కోటీశ్వరమూర్తి, శరత్ బాబు కోరారు. కాకతీయ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్లవేడు గ్రామానికి చెందిన మందాల రవీందర్ రెడ్డి వద్ద 146/2 సర్వే నంబర్ లోని ఎకరం భూమిని కొనుగోలు చేశామని, అదే భూమిని రవీందర్ రెడ్డి తిరిగి వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. చాలా ఏండ్లుగా ఇబ్బందిపడిన తాము ఆ భూమిని అమ్మడానికి సిద్ధపడగా ఆ భూమిని తాము కొన్నామని కొంత మంది ఎస్సీలు చెప్పడమే కాకుండా అందులో వారు డబ్బా ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ డ్యాక్యుమెంట్స్ని తీసుకొని తహసీల్దార్‌కు పంపించారని చెప్పారు. తహసీల్దార్ విచారణ జరిపి ఎస్సీల డ్యాక్యుమెంట్స్ ఫేక్ అని సీఐకి నివేదిక ఇచ్చారని, వెంటనే సీఐ వారిని పిలిచి డబ్బా తీయమని చెప్పారన్నారు. కానీ, వారు డబ్బా తీయక పోగా తాము చాలా ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన డబ్బాను జేసీబీతో కూల్చివేశారన్నారు. ఈ విషయంపై కేసు పెట్టి నాలుగు రోజుల నుంచి తీరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వారు కోరారు.
