నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని నూతనంగా లలిత మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, శనివారం ప్రారంభం చేశారు.డాక్టర్ సి హెచ్ పద్మ,డాక్టర్ బి.రవికుమార్,డాక్టర్ ఏ బాలరాజు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ హింగే రాజుల ఆధ్వర్యంలో లలిత మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆసుపత్రి వైద్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వి ఎం జయుడు,సీనియర్ డాక్టర్ మోహన్ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టిపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ గందే రజిత చంద్రమౌళి,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి రవీందర్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,కౌన్సిలర్ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.