భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పార్టీ శ్రేణులకు తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీడిత ప్రజల పెన్నిధి, కార్మిక, కర్షక, విద్యార్థి యువజన, మహిళా, రైతు, కూలి సమస్యలపై స్పష్టమైనటువంటి అవగాహనతో పని చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారామయ్య చూరి. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశ ప్రజలకు తీరని లోటు. ఘనంగా సిపిఎం పార్టీకి భారీ నష్టం. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశ ప్రజలందరినీ కదిలించింది. ఆదర్శమైనటువంటి నాయకుడిని ఇప్పటివరకు చూడలేదని దేశ ప్రజలందరూ కొనియాడుతున్నారు. ప్రపంచంలోని సోషలిస్టు దేశాలన్నీ సీతారాం మేల్చూరి భౌతిక కాయాన్ని చూడడానికి ఢిల్లీ బయలుదేరాయి. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతిక్కాయని, ఆయన కోరిక ప్రకారంగా ఢిల్లీ లో ఎయిమ్స్ కు అప్పగిస్తారు. ఏ మతాచార ప్రకారంగా ఆయన అంతక్రియలు జరగవు. వైద్య విద్యార్థుల అవగాహన కోసం ఆయన డెడ్ బాడీ ఉపయోగపడుతుంది. సుదీర్ఘ కాలంగా ఎంపి గా పని చేశాడు. ఉత్తమ పార్లమెంటు సభ్యునిగా పేరు తెచ్చుకున్నాడు.ఆయన నమ్మిన సిద్ధాంతం జనతా ప్రజాస్వామ్య విప్లవం రావాలని, కార్మిక వర్గ నాయకత్వన రాజ్యము రావాలని, దోపిడి రహిత సమాజం ఏర్పడాలని, సమాజం రావాలని, అట రైతా కుల రైతా సమాజం ఏర్పడాలని, బడదారి సమాజం నశించాలని, పేదల రాజ్యమే రావాలని కోరుకున్న సిద్ధాంతం. ఉమ్మడి వరంగల్ జిల్లా జక్కులొద్దలో పేదలేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు రావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరిగినటువంటి నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న టువంటి పేదలందరికీ ఇంటి పట్టాలి ఇచ్చి ఇండ్లు నిర్మించాలని కోరుకున్నటువంటి నాయకుడు.ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోజులపాటు సిపిఎం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని, కేవలం సీతారామయ్య ఏచూరి సంతాప సభలు మాత్రమే జరపాలని ఈ జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మూడు రోజులపాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాలని కోరారు. గ్రామ గ్రామాన ప్రతి మండలంలో వార్డులో సీతారామయ్య ఏచూరి చిత్రపటాలకు నివాళులర్పించాల అని చెప్పి పార్టీ శ్రేణులు అందరికీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, పార్టీ నాయకులు అబుదారీ రమేష్, కడప శేఖర్, మేకల మహేందర్, రజిత, వనపాకల లింగయ్య, లక్ష్మయ్య, ఉదయ్, మామిడి రాధమ్మ, తదితరులు పాల్గొన్నారు.