నర్సంపేట ,నేటిధాత్రి :
నర్సంపేటలో పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి రుద్ర హోమాన్ని నిర్వహించారు.వేద పండితులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో హోమ క్రతువు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ హోమంలో పట్టణానికి చెందిన 150 మంది దంపతులు పాల్గొన్నారు.అనంతరం మహా అన్నదానాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న దంపతులకు లక్కీ డ్రా ద్వారా ఐదుగురిని ఎంపిక చేసి వెండి కుంకుమ భరణిలను అందజేశారు.ఈ సందర్భంగా గణపతి లడ్డును వేలంపాట ద్వారా పరికిపండ్ల ఏకాంబరం రూ.30,116తో దక్కించుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రుద్ర ఓం ప్రకాష్, కామని రవీందర్ రాజేందర్, పర్ష శ్రీధర్, కోదాటి గోపాలకృష్ణ, బాల్నే జగన్, ఎంగలి బిక్షపతి, కోడూరు రవి తదితరులు పాల్గొన్నారు.